నమస్కారం....
ఇంతకూ ముందు మనం నక్షత్రాల గురించి తెలుసుకున్నాం .
ఇప్పుడు రాశులు ....
మనకు మొత్తం 12 రాశులు (Birth Signs) ఉన్నాయి .
అవి....
- మేష రాశి - అశ్వని , భరణి , కృతిక 1 వ పాదం
- వృషభ రాశి - కృతిక 2,3,4 పాదాలు, రోహిణి , మృగశిర 1,2 పాదాలు
- మిధున రాశి - మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర , పునర్వసు 1,2,3 పాదాలు
- కర్కాటక రాశి - పునర్వసు 4 వ పాదం, పుష్య , ఆశ్లేష
- సింహ రాశి - మఘ , పుబ్బ, ఉత్తర 1 వ పాదం
- కన్య రాశి - ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
- తులా రాశి - చిత్త 3,4 పాదాలు, స్వాతి , విశాఖ 1,2,3 పాదాలు
- వృశ్చిక రాశి - విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
- ధను రాశి - మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ 1వ పాదం
- మకర రాశి - ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ , ధనిష్ఠ 1,2 పాదాలు
- కుంభ రాశి - ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం , పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
- మీన రాశి - పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర , రేవతి
ఒక రాశికి కొన్ని నక్షత్రాలు చెందుతాయి. మనం పుట్టిన సమయాన్ని బట్టి మన జన్మ పాదం మరియు నక్షత్రం ఎలా ఐతే నిర్ణయిస్తారో అలాగే మన జన్మ పాదం మరియు నక్షత్రాన్ని బట్టి రాశిని కూడా నిర్ణయిస్తారు.
ఇక శెలవు.... మళ్లీ కలుద్దాం ....
ఇక శెలవు.... మళ్లీ కలుద్దాం ....
No comments:
Post a Comment