Friday, September 28, 2012

షడ్రుతువులు

నమస్కారం ...

మనం మామూలుగా, వాడుకలో  ఏ ఋతువునైనా, మూడు కాలాలుగా మాట్లాడుతూ ఉంటాము.

అవి వేసవి కాలము (Summer), శీతా కాలము (Winter), వర్షా కాలము (Rainy).

కానీ పంచాంగం లో 6 కాలాలు లేక ఋతువులు(seasons) చెప్పబడినవి. వాటిని షడ్రుతువులు అంటారు.

అవి ఏంటి ?

అవి తెలుగు మరియు ఇంగ్లీష్  నెలల ప్రకారం ఎప్పుడు ఉంటాయి ?

ఏ ఋతువు లో ఏ పండుగలు వస్తాయి ?

ఇప్పుడు చూద్దాం ...


  1. వసంత ఋతువు - (Spring) - చైత్రము మరియు వైశాఖ మాసాలు - March 20 to May 20
                                    - ఉగాది , శ్రీ రామ నవమి , హనుమ జయంతి

            చెట్లు చిగిర్చి పూవులు పూయును .

     2.  గ్రీష్మ ఋతువు    - (Summer) - జ్యేష్ఠ మరియు ఆషాఢ మాసాలు - May 20 to July 20

                                   - రథ యాత్ర , గురు పౌర్ణమి
         
            ఎండలు  మెండుగా కాయును .

           
     3. వర్ష ఋతువు      - (Monsoon) - శ్రావణ మరియు భాద్రపద మాసాలు - July 20 to September 20

                                   - రక్షా బంధన్ , శ్రీ కృష్ణ జన్మాష్ఠమి , వినాయక చతుర్థి

         వర్షములు విశేషముగా కురియును .

     4. శరద్ ఋతువు    - (Autumn) - ఆశ్వీయుజ మరియు కార్తీక మాసాలు - September 20 to November 20

                                   - విజయ దశమి , దీపావళి , కార్తీక పౌర్ణమి

           మంచి  వెన్నెల కాయును .





      5. హేమంత ఋతువు - (Winter) - మార్గశిర మరియు పుష్య మాసాలు - November 20 to January 20

                                       - సంక్రాంతి

          మంచు  కురియును .చలి ఎక్కువ .

     6. శిశిర ఋతువు       - (Winter & Fall) - మాఘ మరియు పుష్య మాసాలు - January 20 to March 20

                                      - శివరాత్రి , వసంత పంచమి

         చెట్లు  ఆకులు రాల్చును . 

ఇ క శెలవు ... మళ్లీ కలుద్దాం ....

No comments:

Post a Comment