Friday, February 15, 2013

అష్ట సిద్ధు ల  గురించి తెలుసుకుందాం . భగవంతుని ధ్యానం లో లీనమై ఆ ధ్యానంలో  భగవంతుని దర్శించ గలిగిన మహాత్ములకు ఈ సిద్ధులు  భగవంతుని నుండి లభిస్తాయి . అవి

1.అణిమ . అణువంత సూక్ష్మ రూపాన్ని ధరించగలగడం .

2.మహిమ . బ్రహ్మాండమైన విరాట్ స్వరూపాన్ని పొందగలగడం .

3.గరిమ . బ్రహ్మాండగోళాల కంటే బరువుగా ఉండడం .

4.లఘిమ .గడ్డిపోచ కంటే తేలికగా ఉండగలగడం .

5.ప్రాప్తి .కోరిన వస్తువు ను లభింప చేసుకోవడం .

6.ప్రాకామ్యము .ఆకాశగమనము  లభిస్తుంది .

7.ఈశత్వము . సర్వానికి అధికారి కావడం .

8.వశిత్వము .సర్వప్రాణి కోటిని  వశం చేసుకుని శాసించగలగడం . ఇవి లభింప చేసు కున్నవారు  మహాత్ములు అవుతారు .వీరికి మామూలు మానవులకు ఉండే కోరికలు ఏమి ఉండవు .వీరు తమ శక్తులని ప్రజల సంక్షేమాని కి
ఉపయోగిస్తారు .  
పంచ భక్ష్య భోజనం  అంటే ఏమిటో తెలుసా  భక్ష్యము , భోజ్యము , లేహ్యము ,చోష్యము ,పానీయము .

అనగా  వీటిలో కొన్ని కొరికి తినేవి ,నమలి తినేవి ,చప్పరించి తినేవి ,జుర్రుకుని తినేవి ,తాగేవి , అయిన ఐదు రకాలతో కూడిన భోజనం . 

అరిషడ్వర్గములు  అంటే తెలుసా . మనలో దాగి ఉండే చెడు స్వభావాలు . వీటినే అంతర్గత శత్రువులు అని అంటారు

అవి   1. కామము  2 .క్రోధము 3 లోభము  4. మోహము  5 మదము  6. మాత్సర్యము .
మనం  ఇప్పుడు దశావతారాలను  గురించి తెలుసుకుందాం .

శ్రీ మహా విష్ణువు దుష్ట సంహారం చేయడానికి అవతరించిన రూపాలే దశావతారాలు .  అవి

1మత్స్యావతారం . 2. కూర్మావతారం  3. వరాహావతారం . 4 నృసింహావతారం  5. వామనావతారం . 6. పరశురామావతారం  7.శ్రీరామావతారం . 8శ్రీకృష్ణావతారం  9. బుద్ధావతారం . 10     కల్క్యావతారం .

Thursday, February 14, 2013

మనం అష్ట లక్ష్ము ల గురించి తెలుసుకుందామా .

అష్ట అంటే ఎనిమిది . అష్టలక్ష్మి లు అంటే లక్ష్మి దేవి ఎనిమిది రూపాలు  అవి .

1. ధన లక్ష్మి .2.ధాన్య లక్ష్మి . 3ధైర్య లక్ష్మి  4.విద్యా లక్ష్మి . 5ఆది లక్ష్మి  6,విజయ లక్ష్మి  7. సంతాన లక్ష్మి  8.గజలక్ష్మి .

Saturday, January 19, 2013

  1.     .చైత్రమాసం .  పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటే దానిని చైత్రమాసం అంటారు .

  2.     వైశాఖమాసం . పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉంటే దానిని వైశాఖ మాసం అవుతుంది.

  3.      జ్యేష్ట మాసం . పౌర్ణమి నాడు జ్యేష్ట నక్షత్రం ఉంటే అది జ్యేష్ట మాసం .

  4.      ఆషాఢ మాసం .పౌర్ణమి నాడు పూర్వాషాఢ గానీ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటే ఆ మాసం ఆషాఢ మాసం .

  5.      .శ్రావణ మాసం . పౌర్ణమి నాడు శ్రవణం అనే నక్షత్రం ఉంటుంది కనుక అది శ్రావణ మాసం .

  6.       భాద్రపదం . పౌర్ణమి నాడు పూర్వాభాద్ర గాని ఉత్తరాభాద్ర నక్షత్రాలలో ఏది ఉన్న అది భాద్రపదమాసం .

  7.       ఆశ్వయుజ మాసం . పౌర్ణమి నాడు అశ్వని నక్షత్రం ఉన్నది ఆశ్వయుజం .

  8.        కార్తీక మాసం .కృత్తిక నక్షత్రం  పౌర్ణమి నాడు ఉన్నది కార్తీకమాసం .

  9.       మార్గశిర మాసం . మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది మార్గశిరం .

10.        పుష్యమాసం .పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం ఉన్నది పుష్య మాసం .

11.         మాఘ మాసం . మఘ నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది మాఘమాసం .

12.         ఫాల్గుణ మాసం . ఫల్గుణి నక్షత్రం అనగా  పుబ్బ .ఉత్తర నక్షత్రాలను  పూర్వ ఫల్గుణి అని ఉత్తర ఫల్గుణి అని అంటారు .వీటిలో ఏ నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నా గాని అది ఫాల్గుణ మాసం .


Monday, December 10, 2012

తిథులు - పండుగలు

1. పాడ్యమి ----  సంవత్సరాది ---------చైత్రశుద్ధపాడ్యమి  ఉగాది  

2. విదియ -----భానువిదియ  ---------ఆదివారము తో కూడిన విదియ
    విదియ -----భగినీ హస్త భోజనం -----కార్తీక శుద్ధ విదియ   దీపావళి తరువాత వచ్చేది .తెలుగు వారు మగపిల్లలు  అక్కచెల్లెళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చెయ్యాలి .

3.తదియ ----అక్షయ తృతీయ -------వైశాఖ శుద్ధ తదియ . బంగారం దానం చేస్తే అది అక్షయమౌతుంది .
   తదియ ----ఉండ్రాళ్ళతద్ది ---------భాద్రపద బహుళ  తదియ .ఆడపిల్లల నోము
   తదియ ----అట్లతద్ది ---------- ఆశ్వయుజ  బహుళ తదియ . ఇది  కూడా ఆడపిల్లల నోము .

4. చవితి ----నాగులచవితి --------కార్తిక శుద్ధ చవితి
    చవితి ----వినాయకచవితి ------భాద్రపదశుద్ధ చవితి
    చవితి ----సంకష్టహరచతుర్ధి ------ఇది ప్రతి మాసం లోను వచ్చే బహుళ (కృష్ణ )చవితి
     చవితి ----నాగ చతుర్ధి -------శ్రావణ శుద్ధ చవితి .

5.పంచమి ----ఋషిపంచమి ------భాద్రపద శుద్ధ పంచమి .
   పంచమి ----వసంతపంచమి ------మాఘ శుద్ధ పంచమి
   పంచమి ----స్కంద పంచమి -----ఆషాఢ శుద్ధ పంచమి

6. షష్ఠి --------సుబ్రహ్మణ్యషష్ఠి -----మార్గశిర శుద్ధ షష్ఠి
    షష్ఠి ---------కుమారషష్ఠి --------ఆషాఢ శుద్ధ షష్ఠి

7. సప్తమి ----రధసప్తమి ------------మాఘ శుద్ధ సప్తమి

8. అష్టమి ----కృష్ణాష్టమి ------------శ్రావణ బహుళ అష్టమి
    అష్టమి ----దుర్గాష్టమి -----------ఆశ్వయుజ  శుద్ధ అష్టమి

9. నవమి -----మహర్నవమి --------ఆశ్వయుజ శుద్ధ నవమి
    నవమి ----శ్రీరామ నవమి -------చైత్ర శుద్ధ నవమి

10. దశమి ----విజయదశమి ------ఆశ్వయుజ శుద్ధ దశమి

11. ఏకాదశి ---తొలిఏకాదశి -------ఆషాఢ శుద్ధ ఏకాదశి
      ఏకాదశి --ముక్కోటి ఏకాదశి ----మార్గశిర శుద్ధ ఏకాదశి
      ఏకాదశి ---భీష్మ ఏకాదశి -----మాఘ శుద్ధ ఏకాదశి

12.ద్వాదశి ----క్షిరాబ్దిద్వాదశి --------కార్తీక శుద్ధ ద్వాదశి

13.త్రయోదశి ---శనిత్రయోదశి ------శనివారము తో కూడిన త్రయోదశి  ఏ మాసము లో నై నా రావచ్చును .

14.చతుర్దశి ----నరక చతుర్దశి -----ఆశ్వయుజ బహుళ చతుర్దశి

15.పౌర్ణమి -----రాఖీ  పౌర్ణమి,  జంధ్యాల పౌర్ణమి ------శ్రావణ పౌర్ణమి

16. అమావాస్య --  దీపావళి -----------ఆశ్వయుజ  అమావాస్య .

ఇంకా కొన్ని పండుగలు కూడా ఉన్నాయి . అవి భోగి సంక్రాంతి . ఇవి ప్రతి సారి జనవరి 14,15 తారిఖులలోనే వస్తాయి.  ఇంకా కొన్ని రకాలైన హోం టిప్స్ ,హెల్త్ టిప్స్ ,బ్యూటీ టిప్స్ తెలియాలంటే gruhaharam.blogspot.com
చూడండి